సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ
ఇందల్వాయి: సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నా రు. ఈ నెల 26 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీ య భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్ధాయి పరిశీలన నిర్వహించినట్లు కలెక్టర్ గుర్తు చేశారు. ఈ మేరకు వివిధ పథకాల ద్వారా అర్హులుగా గుర్తించబడిన వారి వివరాలను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా గ్రామ సభ వీటికి ఆమోదం తెలిపింది. ఆయా పథకాల కింద ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోని వారితోపాటు, అర్హత కలిగి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేనివారి నుంచి కూడా అర్జీలు స్వీకరించారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు, అనవసర ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు.ఆర్డీవో రాజేంద్రకుమార్, మండల ప్రత్యేక అధికారి వీరాస్వామి, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
లోలంలో గ్రామసభ పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment