కవిత ఫొటోల మార్ఫింగ్‌పై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్‌అర్బన్: ఎమ్మెల్సీ కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం నగర మేయర్ నీతూ కిరణ్, బీఆర్‌ఎస్ మహిళా ప్రతినిధులు కలిసి ఇన్ చార్జి సీపీ సింధుశర్మకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు నగరంలోని బీఆర్‌ఎస్ పార్టీ కా ర్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మేయర్ మాట్లాడారు. కవిత కృషితోనే పసుపుబోర్డు ఏర్పాటు అయిందన్నారు. కొద్ది మంది నాయకులు వారి స్థాయిని మరిచి ఎమ్మెల్సీ కవితను విమర్శిస్తున్నారన్నారు. పసుపు బోర్డు కోసం ఎన్నో సార్లు ప్రధానమంత్రిని, ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి విన్నవించిందన్నారు. పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టి పసుపుబోర్డు అంశాన్ని చర్చించిందన్నారు. ఎమ్మెల్సీ కవితపై విమర్శిలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఎంపీగా గెలిస్తే ఐదు రోజుల్లో అర్వింద్ పసుపుబోర్డు తెస్తానని చెప్పి ఐదు సంవత్సరాల తరువాత తీసుకవచ్చాడని విమర్శించారు. పార్టీ ప్రతినిధులు సుమనరెడ్డి, విశాలిని రెడ్డి, సిర్ప సువర్ణ, విజయలక్ష్మి, గంగామణి, నాయకులు పంచరెడ్డి అనిత ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment