పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
నిజామాబాద్‌అర్బన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని డీఈవో అశోక్ అన్నారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (థీ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్) డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాలస్థాయి యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతి తరగతి నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున 10 మంది విద్యార్థులతో స్కూల్ ఎర్త్ లీడర్స్‌ను ఎన్నుకున్నారు. అనంతరం సంస్థ ప్రతినిధులు అనుదీప్, జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. పర్యావరణం పట్ల నేటి బాలల బాధ్యత వాటి సంరక్షణ మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు. డీఈవో చేతుల మీదుగా ఎర్త్ లీడర్స్ క్లబ్ విద్యార్థులకు బ్యాడ్జెస్ ప్రదానం చేశారు. హెచ్‌ఎం మల్లేశం, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, శ్రీనివాసరావు, డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య, ఫిజికల్ డైరెక్టర్ మాధవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment