ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి
మద్నూర్(జుక్కల్): రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని నేషనల్ హైవే ఇన్సిడెంట్స్ మేనేజర్ సౌరభ్ ప్రతాప్‌సింగ్ సూచించారు. మేనూర్‌లో జాతీయ రహదారి–161లో గల మోడల్ స్కూల్, కళాశాల వద్ద మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. గ్రామస్తులు సర్వీస్ రోడ్లను ఉపయోగించుకోవాలని సర్వీస్ రోడ్డులో ప్రయాణించేటప్పుడు గంటకి 40 కిలోమీటర్ల వేగంలోనే వెళ్లాలన్నారు.
రేపు ఉద్యోగ మేళా
నిజామాబాద్ నాగారం: జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 23న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి బి పి మధుసూదన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో ఖాళీలను భర్తీ చేస్తారన్నారు.ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పాసైన వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద జరిగే ఉద్యోగ మేళాకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు హాజరుకావాలన్నారు. వివరాలకు 9948748428, 6305743423, 77022 59070 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment