‘ఉపాధి’ ఉద్యోగులకు అందని జీతాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): గ్రామీణాభివృద్ధి శాఖలో ఉపాధిహామీ విభాగంలో పని చేస్తున్న చిరుద్యోగులకు వేతనాలు కరువయ్యాయి. నెలనెలా జీతాలు అందక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబాల పోషణ కష్టంగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. అప్పులు చేసి ఇంటిని నెట్టుకురావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 452 మంది..
ఉపాధిహామీ విభాగంలో జిల్లా వ్యాప్తంగా 452 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రతీ నెలా ఉద్యోగుల ఎఫ్‌టీవో జనరేట్ చేసి పంపుతున్నా గతేడాది నవంబర్ నుంచి జీతాలు వారి బ్యాంకు ఖాతాల్లో పడడం లేదు. రాష్ట్ర శాఖలో బడ్జెట్ లేకపోవడంతోనే వేతనాలు ఆలస్యం అవుతున్నాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. వేతనాల ఆలస్యంపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వేతనాలు వచ్చేలా చూస్తానని తెలిపారు.
ప్రతినెలా ఇస్తే బాగుంటుంది
వేతనాలు ఆలస్యంగా రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కుటుంబాల పోషణ కష్టంగా మారుతోంది. విధులకు న్యాయం చేస్తున్న ఉపాధిహామీ ఉద్యోగులకు వేతనాలు ఆపకుండా ప్రతీ నెలా ఇస్తే బాగుంటుంది.
–విజయ్, అకౌంట్స్ అసిస్టెంట్
మూడు నెలలుగా ఎదురుచూపులు
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వైనం
Comments
Please login to add a commentAdd a comment