నిజాయితీ చాటిన ట్రాఫిక్ పోలీసులు
ఖలీల్‌వాడి: బంగారం పోగొట్టుకున్న వ్యక్తికి అతడి ఆచూకీ కనుగొని, పోగొట్టుకున్న బంగారం అందించి ట్రాఫిక్ పోలీసులు నిజాయితీని చాటుకున్నారు. నగరంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ వద్ద సోమవారం డ్రంకన్‌డ్రైవ్‌లో వాహనం పట్టుబడటంతో జమనతు ఉండేందుకు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన జనార్ధన్ మూడు గ్రాముల బంగారం కిందపడిపోయినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. దీని విలువ రూ.25 వేలు ఉంటుందన్నారు. ఆ బంగారం ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎండీ ఫైజుద్దీన్‌కి దొరకగా, సీసీ కెమెరాలలో బాధితుడిని గుర్తించి, మంగళవారం జనార్ధన్‌కు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో అందజేశారు. ఫైజుద్దీన్‌ను ట్రాఫిక్ సీఐ ప్రసాద్, సిబ్బంది అభినందించారు.
సీఈఐఆర్ ద్వారా 71 సెల్‌ఫోన్ల రికవరీ
ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గతంలో పలువురు బాధితులు సెల్‌ఫోన్‌లు పోగొట్టుకోగా, సీఈఐఆర్ ద్వారా 71 సెల్‌ఫోన్లను రికవరీ చేసినట్లు డీసీపీ(అడ్మిన్)బస్వారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం సెల్‌ఫోన్‌లను బాధితులకు అందించినట్లు ఆయన వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వారి సెల్‌ఫోన్లను వాడడంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా వారి సెల్‌ఫోన్ పోతే సీఈఐఆర్ పోర్టల్‌లో పూర్తి వివరాలను పొందుపర్చాలన్నారు. పోయిన సెల్‌ఫోన్‌ను త్వరగా పట్టుకుని బాధితులకు అందిస్తామన్నారు. సెల్‌ఫోన్లను అందించేందుకు కృషి చేసిన కానిస్టేబుళ్లు మాన్‌సింగ్, అనుషా, సుష్మలకు ప్రసంశపత్రాలను అందజేశారు.
బోధన్ టౌన్‌కు రెండో స్థానం
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలో జనవరిలో పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అందించడంలో బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ రెండోస్థానం దక్కించుకుంది. ఈసందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మాన్‌సింగ్ జిల్లా ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ చేతులమీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. జనవరిలో 38ఫోన్లను రికవరీ చేసినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment