హోంగార్డు ఆత్మహత్యాయత్నం
ఖలీల్‌వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లోని రైల్వే పట్టాలపై హోంగార్డు ఆత్మహత్యకు యత్నించినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా.. మంగళవారం ఉదయం 5.55గం.కు రైల్వే స్టేషన్ పట్టాలపై ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటున్నాడని డయల్ 100కు కాల్ వచ్చింది. దీంతో వారు వెంటనే రైల్వే పోలీస్‌స్టేషన్‌లోని పోలీసు సిబ్బంది కుబేరుడు, రాములను తనిఖీకి పంపించారు. ప్లాట్‌ఫాం–3 పట్టాలపై ఒక వ్యక్తి పట్టాలపై కూర్చొని ఉండగా అతడిని పట్టుకుని వచ్చి రైల్వేస్టేషన్‌లో విచారించారు. అతడు తన పేరు తాటికొండ నర్సయ్య అని హోంగార్డుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. తన భార్య, అత్తమామల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు తెలిపారు. అనంతరం అతడిని నాలుగోటౌన్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
కాపాడిన రైల్వే పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment