విద్యారంగ అభివృద్ధికి చర్యలు
నిజామాబాద్ అర్బన్: విద్యారంగ అభివృద్ధికి ప్రభు త్వం చర్యలు చేపడుతున్నట్లు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించా రు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 11 మందికి అవార్డులు అందజేసి, సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందన్నారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిధులు కేటాయించి పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, భవనాల మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో మేయర్ నీతూకిరణ్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఎంఈవోలు సాయారెడ్డి ,సేవ్లా, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment