గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

Published Tue, Jan 21 2025 1:58 AM | Last Updated on Tue, Jan 21 2025 1:58 AM

గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌అర్బన్‌: గణతంత్ర దినోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో సోమవారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జరిగే రిపబ్లిక్‌ డే వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమ న్వయంతో పని చేయాలన్నారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని సూచించారు. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రైతు భరో సా, ఇందిరమ్మ ఆత్మీ య భరోసా, ఆహార భద్రతా (రేషన్‌) కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి శకటాలను ప్రదర్శించాలని కలెక్టర్‌ సూచించారు. వీటితోపాటు గృహాజ్యోతి, రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌, రైతు రుణ మాఫీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వంటి పథకాల ప్రాధా న్యతను చాటేలా శకటాలను ప్రదర్శించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, పశు సంవర్ధక, విద్య, వైద్యం, సీ్త్ర శిశు సంక్షేమం, ఫిషరీస్‌, ఇరిగేషన్‌ తదితర శాఖల పనితీరును చా టేలా స్టాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఉత్తమ ఉ ద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించేందుకు పరిమితితో కూడిన ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రాధాన్యతనిస్తూ, ఈ నెల 22 లోగా పేర్లను ప్రతిపాదనల రూ పంలో సిఫార్సు చేయాలని అధికారులకు సూచించారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా వి ద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్య లు తీసుకోవాలని ట్రాన్సోకో అధికారులను ఆదేశించారు. దేశభక్తిని చాటేలా విద్యార్థులచే సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ కుమార్‌, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డీఆర్డీవో సాయాగౌడ్‌, నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్ర కుమార్‌ పాల్గొన్నారు.

అధికారులతో జిల్లా కలెక్టర్‌ సమీక్ష

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement