స్మార్ట్‌గా వ్యవసాయం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: యాంత్రీకరణ ఉపయోగిస్తూనే స్మార్ట్‌గా పసుపు పంటను సాగు చేస్తున్నాడు ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన యువరైతు నలిమెల చిన్నారెడ్డి. కూలీల సమస్య అధిగమిస్తూనే, పెట్టుబడి వ్యయం భారీగా తగ్గించుకుంటున్నాడు. అధిక దిగుబడితో రాబడి సాధిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తనకున్న 12 ఎకరాల్లోని 6 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నాడు. ఆదర్శ రైతుగా గుర్తింపు తెచ్చుకుని 2019లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతురత్న అవార్డు ను సైతం అందుకున్నాడు.
అన్ని పనులు యంత్రాలతోనే..
పసుపు సాగుకు వ్యవసాయ క్షేత్రాన్ని సిద్ధం చేసుకోవడానికి కల్టివేటర్, బెడ్ మేకర్(దీంతో మూడు అ డుగుల వెడల్పు, అడుగు ఎత్తులో బెడ్ వేస్తారు), పసుపు విత్తుకోవడానికి ప్లాంటర్, కలుపు తీసేందు కు మినీ పవర్ టిల్లర్, పసుపు తవ్వకానికి టర్మరిక్ డిగ్గర్(దీంతో కూలీల ఖర్చు తగ్గుతుంది), పసుపు కొమ్ములు ఉడకబెట్టేందుకు బాయిలర్, పాలిషర్ యంత్రాలను చిన్నారెడ్డి ఉపయోగిస్తున్నాడు. దీంతో ప్రతి ఏటా వ్యవసాయ కూలీల సమస్యను అధిగమిస్తున్నాడు. బెడ్ మేకర్, ప్లాంటర్, టర్మరిక్ డిగ్గర్ వాడడం అరుదు. పూర్తి స్మార్ట్ యంత్రీకరణతో ఎకరంలో పసుపు సాగుకు రూ.1.5 లక్షల పెట్టుబడి అవుతుంది. చిన్నారెడ్డికి మాత్రం రూ.1లక్ష మాత్ర మే ఖర్చు అవుతోంది. మరోవైపు కుర్కుమిన్ శాతం అధికంగా ఉండే రాజేంద్ర సోని, ఏసీసీ–79, ప్ర గతి, పీతాంబర్, రాజేంద్ర సోనాలి, రాజపురి, బీఎస్సార్–2 వంగడాలను సాగు చేస్తున్నాడు. స్థానికంగా సాగు చేసే పసుపులో 2 శాతం కుర్కుమిన్ ఉంటుండగా, చిన్నారెడ్డి సాగు చేస్తున్న వంగడాలతో 4 నుంచి 5 శాతం కుర్కుమిన్ వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లి నూతన వంగడాలు, మా ర్కెట్ గురించి అధ్యయనం చేసిన చిన్నారెడ్డి 8 ఏళ్లుగా ఆధునిక విధానంలో సాగు చేస్తున్నాడు. పంటకు తెగు లు సోకకుండా, వర్షం నీరు నిలిచి కొమ్ము మురిగి పోకుండా ఉండేందుకు ఎత్తుమళ్ల పద్ధతిలో సాగు చేయడం ఈ రైతు ప్రత్యేకత.
విత్తన పసుపు కోసం చిన్నారెడ్డి వద్దకు..
మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పసుపు రైతులు చిన్నారెడ్డి వద్ద విత్తన పసుపును కొనుగోలు చేస్తున్నారు. దీంతో శుద్ధి భారం సైతం తగ్గించుకుని ఆర్థికంగా లాభపడుతున్నాడు. విత్తనానికి అమ్మగా మిగిలిన పసుపును శుద్ధి చేసి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో అమ్ముతున్నాడు. ఎకరానికి 100 నుంచి 150 క్వింటాళ్ల పచ్చి పసుపు దిగుబడి వస్తుండగా, పసుపు కొమ్ములను ఉడకబెట్టి, ఎండబెట్టి, పాలిష్ చేసిన అనంతరం 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తున్నాడు. ఇక తన యంత్రాలను గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులకు సైతం అందిస్తూ చేదోడుగా ఉంటున్నాడు.
పసుపు విత్తే యంత్రం
ఆధునిక యంత్రాలతో పసుపు సాగు
యంత్రంతోనే పసుపు విత్తడం, తవ్వకం
కర్కుమిన్ అధికంగా వచ్చే
వంగడాల సాగు
కూలీల సమస్య అధిగమిస్తూ, పెట్టుబడి వ్యయం తగ్గించుకుంటూ..
రైతురత్న అవార్డు గ్రహీత చిన్నారెడ్డి
కర్కుమిన్ ఆధారిత మార్కెట్ కల్పించాలి
అధిక ప్రయోజనాలు కలిగిన నూతన వంగడాలను సాగు చేస్తున్న పసుపు రైతులను ప్ర భుత్వం ప్రోత్సహించాలి. కర్కుమిన్ ఆధారిత మార్కెట్‌ను నిజామాబాద్‌లో ఏర్పాటు చేయాలి. కష్టపడి నూతన వంగడాలను సాగు చేస్తున్నప్పటికీ ఆశించి న ధర లభించడంలేదు. లోకల్ పసుపునకు లభించే ధరపై 25 నుంచి 30 శాతం అదనంగా కర్కుమిన్ శాతం ఎక్కవ ఉన్న పసుపునకు ధర కల్పిస్తే గిట్టు బాటు అవుతుంది. ప్రభుత్వం పసుపు రైతులను ఆదుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి.
– నలిమెల చిన్నారెడ్డి , రైతు
Comments
Please login to add a commentAdd a comment