చట్టం పరిధి దాటి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు
సుభాష్‌నగర్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం పరిధిని దాటి అప్పులు చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. అయినా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేక పోతున్నారని ఆరోపించారు. సోమవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ సంవిధాన్ గౌరవ దివస్ వర్క్‌షాప్ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం దేశానికే గర్వకారణమని, ఇది సాధించిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అభినందనలు తెలియజేశారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎంపీ అర్వింద్ పేరును రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రేసులో నుంచి తొలగించేందుకే పసుపు బోర్డు ఏర్పాటు అనేది అవాస్తవమని అన్నారు. రాష్ట్రంలో 13 నెలల్లో 13 కుంభకోణాలు ఆధారాలతో సహా బయట పెట్టి నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కాంగ్రెస్ స్వా ర్థం కోసం పని చేస్తే.. బీజేపీ ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానం అతి త్వరలోనే నియమిస్తుందని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
11 నుంచి 25 వరకు సంవిధాన్
గౌరవ్ అభియాన్
భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఆ దేశాల మేరకు జనవరి 11 నుంచి 25 వరకు సంవిధాన్ గౌరవ్ అభియాన్‌ను నిర్వహిస్తున్నట్లు మహే శ్వర్‌రెడ్డి తెలిపారు. సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 22, 23 తేదీల్లో ఎస్సీ, ఎస్టీ బస్తీల్లో సమావేశాలు, 24, 25 తేదీల్లో కళాశాలలు, హాస్టళ్లలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సేవలు, రాజ్యాంగం పట్ల బీజేపీ నిబద్ధతను తెలియ జేస్తారని తెలిపారు. 26న ప్రతి బూత్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు, రాజ్యాంగంలోని ప్రవేశిక, ఆదేశిక సూత్రాలను చదివి విన్పించాలన్నారు. కార్యక్రమాలు విజయవంతమయ్యేలా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శులు పోతన్‌కర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, స్రవంతిరెడ్డి, నక్క రాజేశ్వర్, జిల్లా పదాధికారులు, అసెంబ్లీ కన్వీనర్లు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.
పసుపు బోర్డు దేశానికే గర్వకారణం
బోర్డు ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు హాస్యాస్పదం
½gôæï³ Ô>çÜ-¯]lçÜ¿ê 糄ýS ¯ól™èl ˘
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శ
Comments
Please login to add a commentAdd a comment