వార్డు, గ్రామ సభలకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

వార్డు, గ్రామ సభలకు సిద్ధం

Published Tue, Jan 21 2025 1:58 AM | Last Updated on Tue, Jan 21 2025 1:58 AM

వార్డు, గ్రామ సభలకు సిద్ధం

వార్డు, గ్రామ సభలకు సిద్ధం

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలో మంగళవారం నుంచి గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ నెల 24 వరకు ఈ సభలు జరుగుతాయి. ఇందు లో ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరో సా, రేషన్‌కార్డుల అర్హులను గుర్తించనున్నారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు గ్రామ సభలు జరుగుతాయి. ఈ సభలకు ఎంపీడీవో, గ్రామ ప్రత్యేక అధికారి, పంచాయతీ సెక్రెటరీలు వివిధ శాఖల ఉద్యోగులు హాజరవుతారు. సభలలో గ్రామంలో గతంలో ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు ప్రదర్శిస్తారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డు లేని వారి వివరాలు ఉంటాయి. వీటితో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దరఖాస్తు దారుల వివరాలు ఉంటారు. దరఖాస్తుదారుల పేర్లను అధికారులు గ్రామ సభలో చదివి వినిపిస్తారు. దరఖాస్తులు ఆయా పథకాలకు అర్హులేనా ? అని గ్రామసభలో అడుగుతారు. దీంతో ఎవరైనా దరఖాస్తుదారుడు తప్పుడు సమాచారం ఇస్తే బహిర్గతమవుతుంది. తక్షణమే అధికారులు విచారణ చేపడతారు. ఒక వేళ దరఖాస్తు దారుడు సంబంధిత పథకానికి అర్హుడేనని గ్రామస్తులు తెలిపితే లబ్ధిదారుడిని జాబితాలో ఎంపిక చేస్తారు. కాగా ప్రజాపాలనలో జిల్లా వ్యాప్తంగా 320831 దరఖాస్తులు వచ్చాయి. వీటిని గత కొన్ని రోజులుగా అధికారులు పరిశీలన చేసి క్షేత్రస్థాయిలో విచారించారు. ఇందులో ఇళ్ల కోసం, రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వివరాలు నమోదు అయ్యాయి.

జిల్లాలోని నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొ రేషన్‌ పరిధిలో 86208 ప్రజాపాలన దరఖాస్తులు, ఆర్మూర్‌ మున్సిపాలిటీలో 11402, భీంగల్‌ మున్సిపాలిటీలో 2459, బోధన్‌ మున్సిపాలిటీలో 14956 దరఖాస్తులు వచ్చాయి. రూరల్‌ పరిధిలో 27 మండలాలకు సంబంధించి 2346 23 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు వీటిని పరిశీలించారు.

నేటి నుంచి 24 వరకు నిర్వహణ

ప్రత్యేక బృందాల ఏర్పాటు

సభలలో దరఖాస్తుదారుల

వివరాలను ప్రకటించనున్న అధికారులు

అనర్హులుగా తేలితే జాబితా నుంచి

తొలగించే అవకాశం

మొత్తం 672 సభలు

గ్రామ సభలు, వార్డు సభల నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌లలో మొత్తం 146 వా ర్డులు ఉన్నాయి. వీటిని 20 క్లస్టర్‌లుగా విభజించారు. 20 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో గ్రామ సభల కోసం 530 పంచాయతీలను 113 క్లస్టర్‌లుగా విభజించారు.113 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. ఇందులోఎంపీడీవోలు, తహసీల్దార్‌లు ఉన్నారు. ఈనెల 21న 200 వార్డు, గ్రామ సభలు, 22న 199 సభలు, 23న 177 సభలు, 24న 96 సభలు నిర్వ హించనున్నారు. మొత్తం కలిపి 672 సభలు జరుగనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement