చరిత్రహీనుడు చంద్రబాబు | Sakshi
Sakshi News home page

చరిత్రహీనుడు చంద్రబాబు

Published Wed, May 8 2024 5:30 AM

చరిత్రహీనుడు చంద్రబాబు

ఉయ్యూరు: చరిత్రహీనుడు చంద్రబాబు అని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. ఉయ్యూరులో మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని 20 వార్డుల్లో వేలాది మందితో రోడ్‌ షో చేశారు. పార్టీ శ్రేణులు ద్విచక్రవాహనాలతో ర్యాలీ చేసి అభిమానాన్ని చాటారు. జోహార్‌ వైఎస్సార్‌, జై జగన్‌, జోగి రమేష్‌ నాయకత్వం వర్థిల్లాలి నినాదాలతో ఉయ్యూరు పట్టణం మార్మోగింది. రోడ్‌షో దారి పొడవునా గజమాలలు, పూల వర్షం, హారతులతో ఫ్యాన్‌ గుర్తుపై రెండు ఓట్లూ వేయాలని మంత్రి జోగి రమేష్‌ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పలు చోట్ల నిర్వహించిన సభల్లో మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ కూటమి కుట్రలు ఎవరూ నమ్మరని తెలిపారు. మంచి చేసే జగనన్నపై విషం చిమ్మాలని చూస్తే తరిమికొడతారని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించిన చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటుదారుడు చంద్రబాబును నమ్మి ఎవరు నడిచినా నట్టేట మునిగిపోవటమేనని తెలిపారు. తప్పుడు మేనిఫెస్టోతో మరోసారి కూటమి పేరుతో మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

వర్షంలోనూ ప్రచార జోరు....

వర్షం లోనూ మంత్రి జోగి రమేష్‌ ప్రచారం సాగించారు. చల్లనిగాలులు, మోస్తరు వర్షం పడుతున్నా కార్యకర్తల ఉత్సాహం నడుమ చిరునవ్వుతో ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లు వేసి జగనన్నకు అండగా నిలవాలంటూ ప్రచారం సాగించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలూ, వ్యాపార రంగాలూ, అగ్రకులాల్లో పేదలు ఆలోచన చేయాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పారు. వెన్నుపోటు ద్రోహులకు గుణపాఠం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జోగి రమేష్‌ అన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నేత చలసాని స్మిత గౌతమ్‌, సీడీసీ చైర్మన్‌ రాజులపాటి రామచంద్రరావు, ఏఎంసీ చైర్మన్‌ వల్లభనేని వెంకటేశ్వరరావు, ఎంపీపీ చీలి కల్పన, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ అబుకలాం, మండల అధ్యక్షుడు దాసే రవి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌లు సోలే సురేష్‌బాబు, అర్షతున్నీసాబేగం, ప్రభుత్వాసుపత్రి చైర్మన్‌ జంపాన కొండలరావు, షాదీఖానీ చైర్మన్‌ అహ్మద్‌ఖాన్‌, కౌన్సిలర్లు డాక్టర్‌ జంపాన పూర్ణిమ, ముడావత్‌ లక్ష్మి, ఊర శ్రీవాణి, గోన మదన్‌, గుంజా సుధాకర్‌, రాజులపాటి చిన్ని, ఎండీ బేగ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ ఖలీల్‌, నాయకులు అబ్దుల్‌సద్దాం, సలీం బేగ్‌, కళాధర్‌, ఉయ్యూరు సుధాకర్‌, వెంట్రప్రగడ బాబ్జీ, పెనుమూడి సంజయ్‌, కొండపల్లి రమేష్‌, దిరిశం జ్యోతిర్మయి, దిరిశం ఇందిరా ప్రియదర్శిని, బాలి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌

ఉయ్యూరులో భారీ ర్యాలీ

ప్రచారానికి అడుగడుగునా నీరాజనం

 
Advertisement
 
Advertisement