మైనార్టీ నేత మొహమ్మద్ ఖలీలుల్లా ఆకస్మిక మృతి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ముస్లిం మైనార్టీల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన నేత, ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి మొహమ్మద్ ఖలీలుల్లా సోమవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన ఉదయం 8 గంటల సమయంలో విజయవాడలోని తన నివాసం నుంచి మార్నింగ్ వాక్ కోసం బందరు కాల్వ ఒడ్డున ఉన్న పార్కుకు వెళ్లి అక్కడే కుప్పకూలి మృతి చెందారు. జాతీయ స్థాయిలో మైనార్టీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై తమ వాదాన్ని వినిపించేందుకు నిర్వహించిన మేధావుల సదస్సుల్లో ఖలీలుల్లా కీలక భూమిక పోషించారు. పౌరసత్వ చట్టం, వక్ఫ్‌బోర్డు సవరణ చట్టాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన సదస్సుల్లో పాల్గొన్నారు. న్యాయవాదిగా అనేక మందికి తనవంతు సహాయ సహకారాలు అందించారు. ఆయన మృతి మైనార్టీ వర్గాలకు తీరని లోటు అని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మునీర్ అహ్మద్ షేక్, ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ మతీన్‌లతో పాటు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ తదితరులు నివాళులర్పించారు.
ఉయ్యూరులో జాబ్‌మేళా
ఉయ్యూరు: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, డీఆర్‌డీఏ–సిడాప్, ప్రభుత్వ ఎన్‌ఏసీ సెంటరు సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉయ్యూరులోని ఎన్‌ఏసీ సెంటరులో జాబ్‌మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో బిజెడ్ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్, పేటీఎం ఇతర కంపెనీల ప్రతి నిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 35 మంది యువత ఇంటర్వ్యూలకు హాజరు కాగా 18 మంది ప్రతిభావంతులను ఎంపిక చేశారు. జాబ్‌మేళాను జిల్లా ఒకేషనల్, ఉపాధి కల్పనాధికారి సత్యబ్రహ్మం, జిల్లా నైపు ణ్యాభివృద్ధి అధికారి పి.నరేష్ కుమార్ పర్యవేక్షించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి తుర్లపాటి మధు, ఎన్‌ఏసీ సెంటరు ఇన్‌చార్జి రవి సుధాకర్, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ వై.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment