జై భవానీ.. జైజై భవానీ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష స్వీకరణ మహోత్సవం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం నుంచి భవానీ మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. మండల దీక్షల స్వీకరణ కార్తిక పౌర్ణమి శుక్రవారం వరకు కొనసాగుతుంది. తొలుత దుర్గమ్మ మూలవిరాట్‌కు పూజలు చేశారు. అనంతరం పగడాల దండను అలంకరించడంతో భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించి మహా మండపం ఆరో అంతస్తు వరకు ఊరేగింపు తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వేద మంత్రోచ్ఛరణల మధ్య ముందుకు సాగగా భక్తులు జై భవానీ.. జైజై భవానీ అంటూ ఊరేగింపులో పాల్గొన్నారు. అమ్మవారికి ఆలయ గురు భవానీ యుద్దనపూడి నాగరాజుశాస్త్రి, వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం నాగరాజుశాస్త్రి, ఆలయ ఈవో కె.ఎస్.రామరావు, ఇతర అర్చకులు మండల దీక్షలను స్వీకరించే భక్తులకు మాలధారణ చేశారు. అమ్మవారి సన్నిధితో పాటు ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి వద్ద పెద్ద ఎత్తున భక్తులు గురు భవానీల చేతుల మీదగా దీక్ష స్వీకరించారు.
ఇంద్రకీలాద్రిపై మాలధారణ ప్రారంభం పౌర్ణమి వరకు దీక్షల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment