పోగొట్టుకున్న బ్రేస్లెట్ భక్తుడికి అప్పగింత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆలయ ప్రాంగణంలో దొరికిన రూ. 2 లక్షల విలువైన బంగారపు బ్రేస్లెట్ను తిరిగి భక్తుడికి అప్పగించిన ఘటన దుర్గగుడిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన గోన పూజిత సాయి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. అమ్మవారి దర్శనం అనంతరం బయటకు వచ్చే సమయంలో సాయి చేతికి ఉన్న బ్రేస్లెట్ జారిపడింది. దీంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న శానిటేషన్ సిబ్బంది డి. దుర్గాదేవి, డి. మంగతాయారు ఆ బ్రేస్లెట్ను తీసి ఆలయ ప్రాంగణంలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బందికి అందజేశారు. ఇంతలో చేతికి ఉన్న బ్రేస్లెట్ కనిపించకపోవడంతో సాయి కంగారుగా ఆలయ ప్రాంగణంలో పోలీసులను సంప్రదించారు. ఈ క్రమంలో బ్రేస్లెట్ను ఆలయ డీఈవో రత్నరాజు సాయికి అందించారు. బ్రేస్లెట్ను అందజేసిన శానిటేషన్ సిబ్బందిని డీఈవో అభినందించి, వారికి నగదు పురస్కారాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment