అంబేడ్కర్ స్మృతి వనం పవిత్రతను కాపాడాలి
అంబేడ్కర్ స్మృతి వనం పవిత్రతను కాపాడాలని, అసంపూర్తిగా మిగిలిన పనులను పూర్తి చేయాలని మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, వెలంపల్లి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలోని వైఎస్సార్ సీపీ బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఈ బృందం అంబేడ్కర్ స్మృతి వనంలో పర్యటించింది. స్మృతి వనాన్ని పరిరక్షించాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిరసన తెలిపింది. పలువురు అంబేడ్క రిస్టులు సైతం ప్రభుత్వ తీరును నిరసిస్తున్నా కూటమి పెద్దలకు మాత్రం చెవికెక్కటం లేదు. పవిత్ర యజ్ఞంలా అందంగా తీర్చి దిద్దిన అంబేడ్కర్ స్మృతి వనం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిన్న చూపు తగదని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment