దుర్గమ్మకు సంక్రాంతి హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు రికార్డుస్థాయిలో ఆదాయం సమకూరింది. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తులో మంగళవారం కానుకల లెక్కింపు జరిగింది. రూ.3,22,45,920 నగదు, 618 గ్రాముల బంగారం, 6.028 కిలోల వెండి లభించినట్లు ఆలయ ఈఓ కె.రామచంద్ర మోహన్ తెలిపారు. 773 యూఎస్‌ఏ డాలర్లు, 125 ఆస్ట్రేలియా డాలర్లు, 30 సౌదీ రియాల్స్, 35 యుఏఈ దిర్హమ్స్, 205 కెనడా డాలర్లు, 93 మలేషియా రింగేట్లు, 120 థాయిల్యాండ్ భాట్స్, 50 ఖతర్ రియబ్‌లతో పాటు మరి కొన్ని దేశాల కరెన్సీ లభించినట్లు వివరించారు. కానుకల లెక్కింపును ఈఓతో పాటు డీఈఓ రత్నరాజు, దేవదాయ శాఖ అధికారులు పర్యవేక్షించగా, ఏఈఓలు, సూపరింటెండెంట్లు, ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో ఈ–హుండీ ద్వారా రూ.1.13 లక్షలను భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment