పచ్చదనంపై గొడ్డలి వేటు
అంబేద్కర్ స్మృతివనం ప్రాంగణాన్ని గత ప్రభుత్వం అందమైన మొక్కలతో ఆహ్లాదం పంచేలా తీర్చిదిద్దింది. కూటమి ప్రభుత్వం ఈ ప్రాంగణంలో ఓ ప్రైవేటు సంస్థ డ్వాక్రా బజారు ఏర్పాటు చేసుకొనే వీలు కల్పించింది. మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల పేరుతో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజారులో కమర్షియల్ దుకాణాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. డ్వాక్రా బజారు కోసం అందమైన పూల మొక్కలు, గ్రీనరీపై రేకులు, షామియానాలతో షెడ్లు నిర్మించారు. ఎండ తగలక, నీరు అందక మొక్కలు ఎండిపోయాయి. ఆ ప్రాంతంలో పచ్చదనం పూర్తిగా కనుమరుగైంది. పెద్ద సంఖ్యలో స్టాల్స్‌తో పాటు ఆహారానికి సంబంధించి రకరకాల క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. స్టాళ్లు, క్యాంటీన్ల నుంచి వచ్చిన వ్యర్థాలను స్మృతి వనం ప్రాంగణంలోనే డంప్ చేశారు. దీంతో ఎక్కడ చూసినా వ్యర్థాల కుప్పలు దర్శనమిస్తున్నాయి. వ్యర్థాలు, పచ్చదనం కరువైన స్మృతి వనం ప్రాంగణం వెలవెలబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment