చిక్కాల దంపతులను సత్కరిస్తున్న తెలగా సంఘ ప్రతినిధులు
● తెలగా కులస్తుల సంఘ జిల్లా అధ్యక్షుడు పల్లంట్ల వెంకట రామారావు
నెల్లిమర్ల: జిల్లాలో అధిక శాతమున్న తెలగా కులస్తులు అన్నిరంగాల్లో రాణించాలని తెలగా కులస్తుల సంఘ జిల్లా అధ్యక్షుడు పల్లంట్ల వెంకట రామారావు ఆకాంక్షించారు. పూసపాటిరేగ ఏఎంసీ చైర్‌పర్సన్‌గా నియమితులైన చిక్కాల అరుణకుమారిని జిల్లా తెలగా సంక్షేమ సంఘం శనివారం ఘనంగా సన్మానించింది. నెల్లిమర్ల పట్టణంలోని చిక్కాల స్వగృహం వద్ద జరిగిన సత్కార కార్యక్రమంలో వెంకట రామారావు మాట్లాడుతూ, తమ కులానికి చెందిన మహిళ ఏఎంసీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నెల్లిమర్ల నగర పంచాయతీ అధ్యక్షుడు చిక్కాల సాంబశివరావు, 5, 11 వార్డుల కౌన్సిలర్లు చిక్కాల సుమతి, చిక్కాల సంతోష్‌కుమార్‌లను సంఘం తరఫున సత్కరించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు గంటా అప్పలరాజు, గంటా సతీష్, పి. లక్ష్మణరావు, ఎం. శ్రీనివాసరావు, యాలాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment