ఖోయిర్‌పూట్‌లో జిల్లా స్థాయి యువోత్సవం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్ సమితి కుడుములగూమ్మ పంచాయతీలో ఉన్న డార్విన్ స్మారక డిగ్రీ కళాశాల ఆవరణలో బుధవారం జిల్లాస్థాయి యువోత్సవం నిర్వహించారు. కేంద్ర యువ వ్యవహారాల శాఖ పరిధిలోలోని నెహ్రూ యువ కేంద్రం, మో యువ భారత్ యువోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నృత్య, చిత్రలేఖనం కవితల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రాదన్, ఖోయిర్‌పూట్ సమితి బీడీఓ ఉమాశంకర్ కోయ, జిల్లా అదనపు కలెక్టర్ అజయ్ కుమార్ మండాంగి, జిల్లా అదనపు కార్మిక అధికారి పూర్ణిమా దురుకా పాఠశాల ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ ప్రదన్, జిల్లా నెహ్రు యువ కేంద్ర అధ్యక్షుడు హరిష్ కుమార్ రూపాల్ తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment