గిరిజన గ్రామాల్లో అభివృద్ధి భేష్
● కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల మంత్రి
రక్షా నిఖిల్ ఖడ్సే
పర్లాకిమిడి:
గజపతి జిల్లాలో కేంద్ర యువజన, క్రీడా వ్యవహారాల మంత్రి రక్షానిఖల్ ఖడ్సే గురువారం ఉదయం పర్యటించారు. తొలుత హెలికాప్టర్‌లో గజపతి స్టేడియంలో దిగిన కేంద్ర మంత్రి రక్షా నిఖల్ ఖడ్సేను గజపతి బిజేపీ పార్టీ అధ్యక్షులు కోడూరు నారాయణరావు స్వాగతం పలికారు. అనంతరం సర్క్యూట్ హౌస్‌కు చేరుకుని అక్కడి నుంచి కేంద్ర మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే గుమ్మా బ్లాక్‌లో మునిసింగి, తరంగడ, అనుకుండగూడ గ్రామాలు చేరుకుని అక్కడ రబ్బరు ప్లాంట్‌ను సందర్శించి ఉత్పత్తిని అడిగి తెలుసుకున్నారు. అలాగే కాఫీ పంటను పండిస్తున్న గిరిజన రైతులను ఉత్పత్తిపై అడిగి తెలుసుకున్నారు. పలు అంగన్ వాడీ కేంద్రాలను సందర్శించారు. ముఖ్యంగా కేంద్ర ఆయుష్మాన్ ఆరోగ్య పథకం అమలుపై ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడారు. గుమ్మ ప్రాంతంలో గిరిజనులు కొండవాలు ప్రాంతంలో వరితో పాటు అరటి పంటను పండిస్తున్న తీరును చూసి సంతోషం వ్యక్తం చేశారు.
కలెక్టరేట్‌లో సమీక్ష
అనంతరం కలెక్టరేట్‌లో వివిధ ప్రభుత్వ అధికారులతో ఆయన పలు పనులపై సమీక్షించారు. సమావేశంలో ఎమ్మెల్యే రేపేష్ పాణిగ్రహి, కలెక్టర్ బిజయ కుమార్ దాస్, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు, రబ్బరు ప్లాంట్ మేనేజరు సనాతన శెఠి, బ్లాక్ అధికారులు, చైర్మన్లు ఎన్.వీర్రాజు, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా బయటకు వచ్చిన కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే విలేకరులతో మాట్లాడారు. గజపతి జిల్లా ఆకాంక్ష జిల్లాలో ఎంపికై న తర్వాత పథకాల అమలు బాగుందన్నారు. మరో నాలుగేళ్లలో గజపతి జిల్లాలో ఆదివాసీ ప్రాంతాలన్నీ అభివృద్ధి జరుగుతాయన్నారు. జిల్లాలో స్పోర్ట్స్ కాంప్లెక్సును నిర్మించడానికి నీతి ఆయోగ్‌తో సంప్రదిస్తానని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment