న్యాయవాది అశోక్ మిశ్రకు ఘన నివాళి
జయపురం: జయపురంలో ప్రముఖ న్యాయవాది హోల్ మౌంట్ వేలీ యజమాని, సమాజ సేవకుడు, బీజేపీ నేత స్వర్గీయ అశోక్ మిశ్ర సంతాప సభ గురువారం మౌంట్ వేలీ సభాగృహంలో నిర్వహించారు. ఈ సంతాప సభలో కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ, విశ్రాంత ఐఏఎస్ అధికారి అరుణ కుమార్ మిశ్ర, దక్షిణ ఒడిశా ఆదివాసీ మహాసంఘం అధ్యక్షుడు, అఖిల భారత భ్రస్టాచార వ్యతిరేక సంఘటన ఒడిశా కార్యదర్శి అర్జున భొత్ర, కార్యదర్శి అనిల్ కుమార్ మిశ్ర, సీనియర్ సిటిజన్ భువన మిశ్ర, పలువురు ప్రముఖులు పాల్గొని అశోక్ మిశ్ర చిత్రపటానికి నివాళులర్పించారు. అశోక్ మిశ్ర సేవలను పలువురు వక్తలు కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment