శిశుమందిర్‌ను ఆలయంగా భావించాలి
జయపురం: సరస్వతీ శిశుమందిరాన్ని పవిత్ర ఆలయంగా భావించి, పిల్లలకు సంస్కారంతోపాటు మానవత్య విలువలతో కూడిన గుణాత్మక విద్యను బోధించాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. గురువారం స్థానిక శారదా విహార్ సరస్వతీ విద్యామందిరం వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతోపాటు వారి తల్లిదండ్రులదేనన్నారు. విద్యాలయ పరిచాలన కమిటీ అధ్యక్షుడు కిశోర్ చంద్ర పండా అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవంలో జయపురం తహసీల్దార్ సత్యవాది జెన, గౌరవ అతిథిగా పాల్గొన్నారు, ముఖ్యవక్తగా డాక్టర్ మనోరంజన్ ప్రదాన్ హాజరయ్యారు. ఒడిస్సీ నృత్యాలు, నాటికలతోపాటు పలు సంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విద్యాలయ యాజమాన్యం నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment