క్రీడాపోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఎచ్చెర్ల: రణస్థలం మండలం జేఆర్‌పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 7, 8వ తేదీల్లో నిర్వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గ అంతర పాఠశాలల గ్రిగ్స్ పోటీలలో లావేరు మండలం వెంకటాపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. బ్యాడ్మింటన్ జూనియర్ బాలిక విభాగంలో ఎస్.పూజిత, ఎల్.జయలక్ష్మీ, టెన్నికోయిట్‌లో ద్వితీయ స్థానంలో ఎస్.పూజిత, పి.పూజిత విజయం సాధించారు. బ్యాడ్మింటన్ జూనియర్ బాలురు విభాగంలో డి.ఉదయ్, జి.ధనుష్, సీనియర్ బాలికల విభాగంలో ఎం.రాజేశ్వరీ, ఎం.మేఘన విజేతలుగా నిలిచారు. సీనియర్ బాలురు విభాగంలో డి.వంశీ, జె.దినేష్‌లు, టెన్నికాయిట్ విభాగంలో డి.వంశీ, ఎస్.తరుణ్‌లు విజయం సాధించారు. విజేతలను హెచ్‌ఎం ఎస్.అరుణకుమారి, పీడీ పి.సూర్యారావు, ఉపాధ్యాయులు అభినందించారు.
జి.సిగడాం: రణస్థలం మండలంలో ఇటీవల డివిజన్ స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో జాడ ప్రాథమికోన్నత పాఠశాల బాలికల జట్టు ద్వితీయ స్థానం సాధించారు. వీరిని హెచ్‌ఎం బెవర రామినాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు కె.వెంకటనాయుడు, ఉపాధ్యాయులు గురువారం అభినందించారు.
ఎచ్చెర్ల క్యాంపస్: పాండిచ్చేరిలో ఈ నెల 11 నుంచి జరగనున్న జాతీయ స్థాయి సౌత్‌జోన్ సాఫ్ట్‌బాల్ పోటీలకు కేశవరావుపేట ఉన్నత పాఠశాలకు చెందిన పొందూరు హరికృష్ణ, గురుగుబెల్లి దుర్గాప్రశాంతి, పొందరు లావణ్య ఎంపికయ్యారు. వీరిని జిల్లా సాఫ్ట్‌బాల్ అసోషియేషన్ అధ్యక్షుడు కలిదిండి నకసింహరాజు, సెక్రటరీ చిగిలిపెళ్లి లక్ష్మీదేవి, హెచ్‌ఎం బి.వి.సాయిరాం, పీడీలు ఎం.వి.రమణ, జి.మల్లేష్ గురువారం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment