● రక్తదాన శిబిరం
రాయగడ: స్థానిక జిల్లా కేంద్రాస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్ ప్రాంగణంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం శుక్రవారం నిర్వహించారు. బజరంగ దళ్ పట్టణ కన్వీనర్ శశ్యజ్యోతి బెహర, శంకర్ బెహర, బిజయ్ చులేట్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన శిబరంలో 20 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని కన్వీనర్ బెహర తెలియజేశారు. ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను విరివిగా ఈ ఏడాది నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
మల్కన్‌గిరి: స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని ఎఫ్‌ఎల్‌సీ హాల్‌లో జిల్లా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆశిష్ ఈశ్వర్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాల్లోకి రక్తదానం ఎంతో గొప్పదన్నారు. రహదారి ప్రమాదాల్లో గాయపడిన ఎంతోమంది సమయానికి రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కార్యక్రమంలో సుమారు 200 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. రక్తదానం చేసినవారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బార్ ప్రధాన్, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ భొయి, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment