సందడిగా క్రీడోత్సవం
జయపురం: స్థానిక నెహ్రూనగర్ జయపురం సిటీ ఇంగ్లిషు మీడియం పాఠశాలలో పదో క్రీడా వార్షికోత్సవం శుక్రవారం సందడిగా జరిగింది. స్థానిక అగ్రసేన్ భవన ప్రాంగణంలోని హనుమాన్ మందిరంలో పూజలు చేసి క్రీడా జ్యోతిని వెలిగించి జయపురం తెలుగు సంస్కృతి సమితి ఉద్యోగులు బిరేన్ పట్నాయక్ క్రీడా వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర పట్నాయక్ నేతృత్వంలో విద్యార్థులు క్రీడా జ్యోతితో డెప్పిగుడ, నెహ్రూనగర్ మహాత్మాగాంధీ రోడ్డులో నినాదాలు చేసుకుంటూ పాఠశాలకు చేరారు. అనంతరం పిల్లలకు పరుగు పందెం, లెమన్ స్పూన్, నీడిల్ అండ్ త్రెడ్ (సూదిలో దారం ఎక్కించటం), స్కిప్పింగ్, హోపింగ్, త్రీ లెగ్డ్ రేస్ పోటీలు నిర్వహించారు. నర్సరీ నుంచి ఏడో తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే 6, 7 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పరుగు పందెంలో సుక్రి, అనిష్ కోశ్ల, విఘ్నేష్ పట్నాయక్ మొదటి మూడు స్థానాల్లో నిలవగా.. 5, 7 తరగతులకు నిర్వహించిన పోటీల్లో సబ్నమ్ ప్రవీణ, డి.హాసవి, కె.యోసితశ్రీలు, 4, 5 తరగతుల బాలురుకు నిర్వహించిన పరుగు పోటీలలో డి.జశ్వంత్, టి.బింధుమాదవ్, శాధీన హియాల్‌లు, విద్యార్థినులకు నిర్వహించిన పోటీలలో ఎ.మోనిక, ప్రత్యూష సింగ్, ఎన్.నిహారిక మొదటి మూడుస్థానాల్లో నిలిచారు. పోటీల నిర్వహణలో కమిటీ సభ్యులు శశిపట్నాయక్, పి.శ్రీనివాసరాజు, ప్రిన్సిపాల్ సుధాకర పట్నాయక్, వైస్ ప్రిన్సిపాల్ సస్మిత సాహు, ఎంఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం.మాధవిలత పాల్గొన్నారు. విజేతలకు ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్టు ప్రధానోపాధ్యాయుడు ప్రతాప పట్నాయక్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment