పోరాటం ఉద్ధృతం చేస్తాం
● 6వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శానిటరీ మేసీ్త్రలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి.తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కల్యాణి అప్పలరాజు, అధ్యక్షుడు కె.వేణుగోపాల్రావులు మున్సిపల్ అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. శానిటరీ మేసీ్త్రలను అకారణంగా తొలగించడాన్ని నిరసిస్తూ మున్సిపల్ శానిటరీ మేసీ్త్రలు, పారిశుద్ధ్య కార్మికులు 6వ రోజు సోమవారం అర్ధనగ్నంగా శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలో చెత్త పేరుకుపోయి ప్రజారోగ్యాలు పాడైపోతున్నా అధికారులు పరిష్కారం చూపకపోవడం దారుణమన్నారు. అధికారులు వెంటనే కళ్లు తెరిచి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మేసీ్త్రల సంఘం అధ్యక్షుడు ముద్దాడ రామారావు, అల్లు రవి, టొంపల షణ్ముఖరావు, మున్సిపల్ యూనియన్ నాయకులు జె.గురుమూర్తి, ఎన్ పార్థసారథి, ఆర్.గణేష్, అర్జీ పెద్దమనేద్ర, తారక, డి.రమణ, రసూల్, సోగ్గాడు, కె.తిరుమలరావు, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment