వినతుల వెల్లువ
మల్కన్‌గిరి: జిల్లా చిత్రకొండ సమితి స్వభీమాన్ ఏరియా పెప్పరమేట్ల పంచాయతీలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు ఈ ప్రాంతాంలో మొత్తం 3754 మంది గిరిజనులు నివసిస్తున్నారు. 153 ఫిర్యాదులు స్వయంగా కలెక్టర్‌కు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ అతి త్వరలో ఇక్కడ ఉన్న ముఖ్య సమస్య పలు గ్రామాలకు రహదారిని పూర్తిచేస్తాన్నారు. గిరిజన రైతులు ఈ ప్రాంతాంలో పసుపు పంటకు కావల్సిన సౌకర్యలు కాల్పిస్తామన్నారు. ఈ స్వభీమాన్ ఏరియాలోని రల్లేగేడ, పనాస్‌పూట్, జోడాంబో, జాంత్రీ, గాజుల్ మామ్మిడి, జాన్‌బాయి, పెవప్పరమేట్ల, బోడపోధర్, బోడపోడ పంచాయతీల్లో ఒకప్పుడు కేవలం గంజాయి సాగు మత్రమే పండించేవారు. గిరిజనులు మావోలు చేతిలో కీలు బోమ్మాల్లా ఉండేవారన్నారు. ఇప్పటికీ గిరిజనులకు అధికారులు అంటే ఎవరో తేలిసిందన్నారు. తమ గ్రామాల్లోకి అధికారులు రావడం ఎంతో ఆనందంగా ఉందని గిరిజనులు అంటున్నారు. కలెక్టర్, ఇతర అధికారులకు ఘన స్వగతం పలికారు. సబ్ కలేక్టర్ దూర్యోధన్ భోయి, జిల్లా అదనపు ఎస్పీ తపాన్ నారాయణ్ రోతో, చిత్రకొండ సమితికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment