రూ.20వేలకు పసికందు విక్రయం
రాయగడ: పేగు తెంచుకుని పుట్టిన పసికందును తొమ్మిది రోజుల వయసులోనే రూ.20వేలకు అమ్మేసిన ఉదంతం వెలుగుచూసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఆరొగ్య శాఖ దర్యాప్తు చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల నువాపడ బస్తీలో నివసిస్తున్న కుముదుని గంట, రాహుల్‌లు దంపతులు. గర్భవతి అయిన కుముదుని ఈ నెల 3 వ తేదీన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, పిల్ల క్షేమంగా ఉండటంతో వారిని వైద్యులు ఇంటికి పంపించారు. అయితే ఈ దంపతులకు అప్పటికే ఒక మూడేళ్ల ఆడపిల్ల ఉండటంతో పాటు ఆర్థిక కష్టాలు ఉన్నాయి. దీంతో వారు మధ్యవర్తుల సాయంతో మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన పెదపెంకి ప్రాంతంలో నివసిస్తున్న కె.రాజశేఖర్ దంపతులకు కేవలం రూ.20 వేలకు బిడ్డను విక్రయించారు. విషయం ఆలస్యంగా బయటకు తెలిసింది. దీంతో సీడబ్ల్యూసీకి చెందిన ప్రియదర్శిని మహాంకుడో మరికొంతమంది సిబ్బంది మంగళవారం నువాపడ ప్రాంతనికి వెళ్లి దర్యాప్తు చేశారు. తమ బిడ్డను విక్రయించినట్లు వారు ఒప్పుకున్నారు.
దర్యాప్తు ప్రారంభించిన వైద్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment