మృతదేహం కోసం బంధువుల రాక
మల్కన్‌గిరి: పోలీసుల ఎదురు కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి కోసం ఆయన బంధువులు వచ్చారు. వారికి మృతదేహాన్ని అప్పగించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం రాత్రి సమయంలో మావోయిస్టులు శబరి నది దాటుతుండగా ఎదురు కాల్పులు జరిగాయి. అయితే మావోలు నది దాటడానికి ఎంక సునమ్ అనే మత్స్యకారుడు సాయం చేశారు. ఈయన పొడియ సమితి మెటగూఢ గ్రామపెద్ద. మావోలను అడవిలోకి పంపేందుకు తన పడవలో దింపాడు. అడవిలో మార్గం చూపిస్తుండగా డీబీఎఫ్ జవాన్లు తారసపడ్డారు. అక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో ఎంక సునమ్ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న ఎంక సునమ్ భార్య, ఆయన సోదరుడు శుక్రవారం మల్కన్‌గిరి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. మావోయిస్టులు వచ్చి నది దాటించాలని కోరారని, పోలీసులే మావోయిస్టు ముద్ర వేసి చంపేశారని చెప్పారు. పోలీసులు మాత్రం ఎంక పూర్తిగా మావోల సానుభూతిపరుడని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం ఎంక మృతదేహన్ని అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment