హోటళ్లపై విస్తృత దాడులు
రాయగడ: పట్టణంలోని పలు హోటళ్లపై సబ్ కలెక్టర్ కల్యాణి సంఘమిత్రా దేవి, ఏసీఎస్వో సుధాంశు భోయ్, సిబ్బంది గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని విజయలక్ష్మి, కేజీఎన్ హోటళ్లలో సోదాలు చేపట్టారు. దీంట్లో భాగంగా నియమాలకు విరుద్ధం వంటగ్యాస్‌ను వినియోగిస్తుండడంతో ఆయా హోటళ్ల నుంచి 12 డొమస్టిక్ గ్యాస్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా స్థానిక గాంధీ నగర్‌లోని ఒక స్వీట్ తయారీ కంపెనీలో పరిసరాల శుభ్రత పాటించకపోవడంతో ఆ తయారీ కేంద్రాన్ని మూసివేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా పలు హోటళ్లలో నాణ్యత లోపించిన ఆహారం విక్రయిస్తున్నారని, అదేవిధంగా అవసరానికి మించి అధిక శాతం కెమికల్స్ వంటి పదార్థాలు వినియోగిస్తున్నారన్నారు. అనంతరం పలు హోటళ్లపై భారీ జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment