మావోల కదలికలపై నిఘా
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాకు అనుకుని ఉన్న మూడు రాష్ట్రాల సరిహద్దులను సీజ్‌చేసి మావోల కదలికలపై నిఘా పెట్టేందుకు ఒడిశా–చత్తీస్‌గఢ్, చత్తీస్‌గఢ్–తెలంగాణ, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు పెట్టారు. శుక్రవారం తొలి డ్రోన్ కెమెరా ఎంవీ 79 పోలీస్ స్టేషన్ పరిధిలో గల జినెల్‌గూఢ అడవిలో ఎగిరింది. శబరి నది ప్రాంతంలో ఉన్న మెటగూఢ, కాటన్‌పల్లి మధ్య ఉన్న గ్రామాల్లోకి హెలికాప్టర్ ద్వారా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి అక్కడ కూడా డ్రోన్ వాడారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమ జిల్లా ఒడిమ్‌గూఢ–ఎర్రబార గిరిజన గ్రామాల మధ్య సరిహద్దులోనూ డ్రోన్లు ఎగరేశారు. అలానే మల్కన్‌గిరి జిల్లా నుంచి కలిమెల సమితి మోటు మీదుగా వెళ్లే రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసేశారు. జినెల్‌గూఢ, టోంకెల్‌గఢ రహదారుల్లో జవాన్లు ముమ్మరంగా గస్తీ కాస్తున్నారు. వాహనాలను పరిశీలించాకే వదులుతున్నారు.
అడవిలో డ్రోన్ కెమెరా అప్‌డేట్ మిషన్
Comments
Please login to add a commentAdd a comment