సిద్ధం
మంగళవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2024
శాసన సభకు గట్టి భద్రత
శీతాకాలం సమావేశాలు పురస్కరించుకుని రాష్ట్ర శాసన సభకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. శాసన సభ పరిసరాల్లో భద్రతా చర్యల పర్యవేక్షణ కోసం 8 తాత్కాలిక పోలీసు శిబిరాలు ఏర్పాటు చేశారు. 24 ప్లటూన్ల పోలీసుల్ని శాంతి భద్రతల కార్యకలాపాల కోసం నియమించారు. 8 మంది అదనపు డీసీపీలు, 2 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలు, 2 యూనిట్ల స్పెషల్ టాక్టికల్ బృందాలు, 4 ప్లాటూన్ల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు (ఎస్‌ఓజీ), జాగిలాల స్క్వాడ్, బాంబు నిష్క్రియ బృందం భద్రతా కార్యకలాపాల్లో ముందంజలో ఉంటారు. సమావేశాల ఆద్యంతం నగరంలో పలు చోట్ల సాదా దుస్తుల్లో ఇంటెలిజెన్సు వర్గాల నిఘా ఉంటుంది. స్థానిక గాంధీ మార్గం గట్టి భద్రతా వలయం మధ్య ఉంటుంది. ఈ ప్రాంతం సీసీటీవీ పర్యవేక్షణలో కొనసాగుతుంది.
శీతాకాల
సమావేశాలకు
భువనేశ్వర్: శాసన సభ శీతాకాలం సమావేశాలు పురస్కరించుకుని స్పీకర్ సురమా పాఢి అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఆమె అధ్యక్షతన శాసన సభలో సోమవారం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశాల్లో 25 దినాలు అధికారిక లావాదేవీలు, 5 ప్రైవేటు సభ్యుల లావాదేవీల కోసం 5 దినాలు ఉంటాయి. ఇలా శీతాకాలం సమావేశాలు సమగ్రంగా 30 రోజులు కొనసాగుతాయని శాసన సభ సచివాలయం తెలిపింది.
మంగళవారం నుంచి శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆద్యంతం సజావుగా కొనసాగించేందుకు అఖిల పక్షాలు సహకరించాలని స్పీకరు తెలిపారు. ఈ అభ్యర్థనపై అఖిల పక్ష సభ్యులు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంపై స్పీకర్ సంతోషం వ్యక్తం చేశారు.
డిసెంబరు నెల 31వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, విపక్ష నేత్రి, చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్, కాంగ్రెసు శాసన సభ నాయకుడు హాజరయ్యారు.
బీజేపీ శాసన సభ సభ్యుల సమావేశం
శాసన సభ శీతా కాలం సమావేశాలు పురస్కరించుకుని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన అధికార పక్షం భారతీయ జనతా పార్టీ శాసన సభ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఆర్గనైజింగు కార్యదర్శి మానస్ మహంతి, పార్టీ ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు. ఈ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, ప్రతిపాదిత కార్యక్రమాలు, విపక్ష ధోరణికి ధీటైన జవాబు వగైరా అంశాలపై అధికార పక్షం వ్యూహం ప్రధాన చర్చనీయాంశంగా సమావేశం కొనసాగింది.
వాహనాల రవాణా నియంత్రణ
శాసన సభ పరిసర మార్గాల్లో వాహనాల రాకపోకల నియంత్రణకు కమిషనరేటు పోలీసు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. శీతాకాలం సమావేశాలు ముగిసేంత వరకు ఈ మార్గదర్శకాలు నిరవధికంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. హౌసింగు బోర్డు నుంచి వచ్చే వాహనాల్ని కేసరి టాకీసు కూడలి నుంచి ఎడమ వైపు మళ్లిస్తారు. ఏజీ స్క్వేర్ నుంచి పీఎమ్‌జీ కూడలి వైపు వెళ్లే వాహనాల్ని జయదేవ్ భవన్ కుడి వైపు నుంచి ఇందిరా గాంధీ పార్కు గుండా మళ్లిస్తారు. మాస్టరు క్యాంటీన్ కూడలి నుంచి పీఎమ్‌జీ వైపు వెళ్లాల్సిన వాహనాల్ని దిగువ పీఎంజీ పక్క వీధి నుంచి దారి మళ్లిస్తారు. 120 ఇన్‌ఫ్యాంట్రీ బెటాలియన్ నుంచి వచ్చే వాహనాల్ని పవరు హౌసు స్క్వేర్ నుంచి పంపిస్తారు. రాజ్ భవన్ స్క్వేర్ నుంచి ఎమ్మెల్యే కాలనీ, రవీంద్ర మండపం వైపు వెళ్లే వాహనాల్ని దారి మల్లించి శాస్త్రి నగర్ గుండా రవాణాకు అనుమతిస్తారు. ఈ నిబంధనలు అత్యవసర సేవల వాహనాలకు వర్తించవు.
నేటి షెడ్యూలు
భారతీయ జనతా పార్టీ ప్రభత్వం రెండో విడత శాసన సభ సమావేశాల్లో తొలి రోజున అదనపు బడ్జెటు సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఆర్థిక బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ బడ్జెటుని మంగళ వారం సభలో ప్రతిపాదిస్తారు.
న్యూస్‌రీల్
నేటి నుంచే సమావేశాలు
Comments
Please login to add a commentAdd a comment