కాశీనగర్ సమితిలో గ్రీవెన్స్‌సెల్
మల్కన్‌గిరి: పర్లాకిమిడి గజపతి జిల్లా కాశీనగర్ సమితి గోరిబంద పంచాయతీలో సోమవారం ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్‌ను అధికారులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బిజాయ్ కుమార్ దాస్ హజార్ పాల్గొ ని 53 వినతులు స్వీకరించారు. వీటిలో గ్రామస్యల పై 19, వ్యక్తిగతంపై 34 వచ్చాయని కలెక్టర్ చెప్పా రు. వీటిని పరిశీలించి పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. కాశీనగర్ సమితిలో గోరిబంధ, సియాలి, బూరద గ్రామ పంచాయతీల నుంచి వినతులు అందాయన్నారు. అనంతరం కలెక్టర్ కాశీనగర్ సమితిలోని పలు స్వ యంసహాయక గ్రూపులను సందర్శించారు. కార్యక్రమంలో గజపతి జిల్లా ఎస్పీ జితేంద్రనాథ్ పండా, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు, సమితి అధ్యక్షరాలు బల్ల సాయమ్మ, ఐటీడీఏ పీవో అంజు మాన్ మాహపాత్రో, బీడీవో డాంబురు దొర మల్లి క్, డీఎస్ఎస్వో సంతోష్‌కుమార్ నాయక్ ఉన్నారు.
మత్తిలి గ్రీవెన్స్ సెల్‌కు 82 వినతులు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి సలీమి పంచాయతీ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ నేతృత్వంలో గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా 82 వినతులు అందాయని అధికారులు తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ తాపాన్ నారాయణ్ రోతో, అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధన్, జిల్లా సామాజిక భద్రతా అధికారి నిర్మల్ దురువా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment