చెత్తకుప్పల్లో అంగన్‌వాడీ ప్యాకెట్లు!
రాయగడ: పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల పంపిణీ చేస్తున్న పిండి ప్యాకెట్లు చెత్తకుప్పల్లో దర్శనమిచ్చాయి. రాయగడ జిల్లాలోని కాసీపూర్ సమితి ఒడాఝొర్ పంచాయతీ కార్యాలయం వెనుక కుప్పలుగా పడిఉన్న ప్యాకెట్లు ఎందుకు కుప్పలుగా పారబోశారన్న ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతోస్పందించిన సంబంధిత శాఖ అధికారులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. పంచాయతీ కార్యాలయానికి దగ్గరలో అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాలకు వచ్చే పుట్టగొడుగుల ప్యాకెట్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా నిరుపయోగంగా నిల్వ ఉంచడంతో అవి పాడవ్వడంతో వాటిని చెత్తకుప్పల్లో పారబోశా రన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాసీపూర్ సమితి పరిధిలోని ఐసీడీఎస్ తరఫున గర్భిణులు, బాలింతలకు వీటిని పౌష్టికాహారంగా పంపిణీ చేస్తున్నారు. అయితే సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇవి నిరుపయోగమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు కూడా ఇవి పంపిణీ చేస్తుండాలి. ఇలా ప్రతీ నెలకు ఒక్కో శిశువుకు రెండు కిలోల 200 గ్రాముల చొప్పున అంగన్‌వాడీ కార్యకర్తలు వీటిని ఆయా కేంద్రాల్లో పంపణీ చేయాల్సి ఉంది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్
అధికారుల దర్యాప్తు
Comments
Please login to add a commentAdd a comment