బీసీ జనాభాను లెక్కించాలి
జయపురం: వెనుకబడిన జాతుల జనాభాను లెక్కించాలని రాష్ట్రీయ వెనుకబడిన జాతుల మోర్చా డిమాండ్ చేసింది. స్థానిక సరోజనీ భవనంలో మోర్చా నాలుగో సమావేశం సోమవారం జరిగింది. సమావేశంలో భవానీపట్న సంధ్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఛొబిలాల్ సాహు ముఖ్యఅతిథిగా సమావేశాన్ని ప్రారంభించించారు. జాతీయ మోర్చా న్యూఢిల్లీ అధ్యక్షుడు బికాశ చౌధురి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ.. వెనుకబడిన జాతుల కులాలవారీగా జనాభా లెక్కలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఆయా కులాల జనసంఖ్య బట్టి ఎస్సీ, ఎస్టీ గుర్తింపునిచ్చి వారిని బీసీల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలలో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ల ద్వారా ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇలా చేస్తే దేశంలో ఉన్న 85 శాతం మూల ఆదివాసీ (ఎస్టీ, ఎస్సీ, వోబీసీ, కన్వెర్టెడ్ మైనారిటీ)లకు అధికారం దక్కేందుకు ఎటువంటి సమస్య ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా కిశోర్ చంద్రపటేల్, పితబాస్ శెట్టి, వెనుకబడినవర్గాల మోర్చా ఒడిశా రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ యాదవ్, భారత ముక్తి మోర్చా మహిళా జాతీయ అధ్యక్షురాలు కమలిణీ యాదవ్, నిరంజన్ మల్లి, కొరాపుట్ జిల్లా యాదవ మహాసభ అధ్యక్షురాలు మదన మోహన నాయక్, రాజేంద్ర కుమార్‌గౌడ, సాథీరాం నాయక్, చంద్రకాంత సుతార్, దండపాణి మహారాణ, సుశాంత మహారాణ, సధానంద భోయి, ఆదిత్య హంస, సాథీ నాయక్, వెనుకబడినవర్గ ప్రజల మోర్చా కలహండి జిల్లా కార్యదర్శి సురేష్ నాయక్ మాట్లాడారు.
వెనుకబడిన వర్గాల మోర్చా డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment