గంజాయి సాగు అంతమొందిస్తాం: డీజీపీ
భువనేశ్వర్: రాష్ట్రంలో గంజాయి సమగ్రంగా అంతమొందిస్తామని రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ వైవీ ఖురానియా విలేకర్లకు తెలిపారు. ఆరేషషను క్లీన్–గ్రీన్ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణాకు సంబంధించి 54 కేసులు నమోదయ్యాయి. 5,300 గ్రాముల గంజాయి జప్తు చేశారు. గంజాయి అక్రమ లావాదేవీల్లో 80 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి మొత్తం నూ. 15 లక్షలు పైబడి నగదు, 20 వాహనాల్ని జప్తు చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా 8 జిల్లాల్లో గంజాయి సాగు విరివిగా కొనసాగుతుంది. డ్రోన్, ఉపగ్రహం ద్వారా ఈ సాగు పట్ల నిఘా కొనసాగుతుంది.
రాష్ట్రంలో కొండ, అటవీ ప్రాంతాలు గంజాయి సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. కంధమల్, బౌధ్, గజపతి, రాయగడ, మల్కన్‌గిరి తదితర జిల్లాల్లో గంజాయి సాగు యదేచ్ఛగా సాగుతుంది. ఆపరేషను క్లీన్ గ్రీన్ కార్యక్రమం కింద తొలి 24 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 375 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగుని అంతమొందించారు.
గత ఏడాది రాష్ట్రంలో 10,500 ఎకరాల విస్తీర్ణపు స్థలంలో గంజాయి సాగు రాష్ట్ర పోలీసులు నాశనం చేశారు. ఈ ఏడాది ఈ పరిమితి అధిగమించాలనే యోచనతో పోలీసు విభాగం నడుం బిగించిందని డీజీపీ వివరించారు. గంజాయి సాగు అంతమొందించడంతో గంజాయి వ్యాపారులపై విభాగం దృష్టి సారించడం విశేషం. నామ మాత్రంగా నెల రోజుల ప్రయాసతో 54 కేసులు నమోదు చేసి 5,300 గంజాయి జప్తు చేశారు. రవాణా జరుగుతున్న సమయంలో ఈ గంజాయి జప్తు చేయడం సాధ్యమైనట్లు ప్రకటించారు. గంజాయి అక్రమ రవాణాకు వినియోగించిన ట్రక్కులు, పిక్ అప్ వ్యానులు, ఇన్నోవా కారులు ఇతరేతర 20 వాహనాల్ని జప్తు చేశారు. 80 మంది నిందితుల్ని అరెస్టు చేసి నగదు రూ. 15 లక్షలు స్వాధీనపరచుకున్నారు.
యువతరం గంజాయి ప్రభావంతో మత్తుకు బానిస కాకుండా చేసేందకు రాష్ట్ర పోలీసు గంజాయి సాగు అంతమొందించాలని కంకణం కట్టుకున్నట్లు డీజీపీ వై. బి. ఖురానియా ప్రకటించారు. గ్రీన్ క్లీన్ మిషను కింద 2026 సంవత్సరం నాటికి రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా అంతమొందించేందుకు లక్ష్య నిర్ధారణ చేసినట్లు డీజీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment