కాపు కుటుంబం జిల్లా కార్యవర్గం ఎన్నిక
● అధ్యక్షుడిగా జర్నలిస్టు కొయ్య శ్రీనివాసరావు
జయపురం: కొరాపుట్ జిల్లా కాపు కుటుంబం కార్యవర్గ ఎన్నిక సోమవారం స్థానిక యాదవ భవనంలో జరిగింది. న్యాయవాది కె.ప్రసాదరావు పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో జర్నలిస్టు కొయ్య శ్రీనివాసరావును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సాధారణ కార్యదర్శిగా పి.జగదీష్‌రావు, ఉపాధ్యక్షులుగా ఎం.ఆదినారాయణ, బి.నరేష్, సహాయ కార్యదర్శులుగా ఎం.ఈశ్వరరావు, బి.శివప్రసాద్, కోశాధ్యక్షుడిగా బి.రమేష్, కార్యవర్గ సభ్యులుగా ఎం.సర్వేశ్వరరావు, పి.తిరుపతి, ఎస్.శివ, పి.శ్రీనివాసరావు, జి.వెంకటరమణ, జి.మన్మథరావు, సి.హెచ్.ఆదినారాయణ, ఎస్.భవానీ, కె.గోపాలరావు, కోటేశ్వరరావు, వై.ప్రసాద్, డి.అప్పారావును ఎన్నుకున్నారు. న్యాయ సలహాదారుడిగా కె.ప్రసాద్ రావు, సలహాదారులుగా పి.భాస్కర రావు, ఎం.శంకరరావు, దాసరి నారాయణ రావు, కె.దుర్గారావును ఎన్నికయ్యారు. 2025 జనవరి 8వ తేదీన కాపు కుటుంబం వార్షిక బంధుమిలన్ కార్యక్రమం ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు కార్యదర్శి జగదీశ్వరరావు వెల్లడించారు. సభ్యులకు అధ్యక్షుడు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment