ప్రాథమిక వైద్యంపై అవగాహన అవసరం
రాయగడ: ఆపద కాలంలో రోగి ప్రాణాలు కాపాడాలంటే ముఖ్యంగా ప్రాథమిక వైద్యం ఎంతో అవస రమని స్థానిక అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ బాబిలత షరప్ అన్నారు. సోమవారం జిల్లా స్థాయి రెడ్ క్రాస్ వలంటీర్ల శిక్షణ శిబిరంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రెడ్ క్రాస్‌లో వలంటీర్లుగా సేవలు అందించేవారు ప్రాథమిక వైద్యా అవస్యకతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వారికి అవగాహన కల్పించేందుకు ఇటువంటి శిక్షణ తరగతులు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డా రు. మూడు రోజులపాటుగా జరగనున్న ఈ శిక్షణ తరగతుల్లో వైద్య రంగ నిపుణులు ఈ మేరకు శిక్షణ కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ రెడ్‌క్రా స్ జిల్లా కన్వీనర్ ప్రశాంత్‌కుమార్ సాహు, కోఆర్డినేటర్ ప్రశాంత్ పండా, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment