అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్టు
జయపురం: అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ కార్తీక్ బహుదూర్ ఉరఫ్ లామా (32)ని సోమవారం అరెస్టు చేసినట్లు పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్ దొలాయి వెల్లడించారు. కార్తీక బహుదూర్ లామా జయపురం సమితి గేట్గుడ వాసి అయిన భీర్ బహుదూర్ లామా కుమారుడని తెలిపారు. కార్తీక్ గంజాయి కేసుల్లోనే కాకుండా దోపిడీ, దొంగతనాలు, లూటీలు, హత్యల్లో కూడా నిందితుడని పేర్కొన్నారు. కొరాపుట్, మల్కనగిరి జిల్లాల్లోని అనేక పోలీసు స్టేషన్లలో అతడిపై కేసులు ఉన్నాయని తెలిపారు. ఇదివరకే అతడికి శిక్ష పడిందని, కస్టడీ నుంచి తప్పించుకున్నాడని, నాలుగేళ్లుగా ఒడిశాలో గంజాయి వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. సోమవారం పోలీసులకు అందిన సమాచారం మేరకు జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి ఆదేశం మేరకు సబ్ఇన్స్పెక్టర్ ఎస్.కె.బెహర, ఎస్ఐ ఎం.సాహులు గేట్గుడ గ్రామంలో అతడి ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారు. అతడిపై నేడు 5 కేసులు, 9 వారెంట్లు ఉన్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment