ఆధ్యాత్మికం విరాజిల్లే చోట సుఖశాంతులు
● ద్విరాష్ట్ర వేద పండిత సంఘ అధ్యక్షులు రాజాస్వామినాథ గురుకుల్ ● యడ్లపాడు గ్రామాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు ● గ్రామస్తులకు ఆశీస్సులు
యడ్లపాడు: ఆధ్మాతికం ఎక్కడ విరాజిల్లుతుందో ఆ ప్రాంతం సుభిక్షంగానూ, అక్కడి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతారని ద్విరాష్ట్ర (తమిళనాడు, పాండిచ్చేరి) వేద పండిత సంఘ అధ్యక్షులు రాజాస్వామినాథ గురుకుల్ తెలిపారు. కేంద్రపాలిత ప్రాంత పుదుచ్చేరిలోని కారైకల్ జిల్లా తిరునల్లార్ గ్రామంలో శనీశ్వరన్ ఆలయంగా ప్రసిద్ధి చెందిన దర్భణేశ్వరస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్న ఆయన గుంటూరు జిల్లాలోని ఓ కృష్ణమందిరం నిర్మాణ పనులు విషయమై వెళ్తూ సోమవారం యడ్లపాడు గ్రామాన్ని సందర్శించారు. హైదరాబాద్ పుడమి బిల్డర్ అధినేత ముత్తవరపు సురేష్‌బాబు ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసిన రాజాస్వామినాథ గురుకుల్ బృందానికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య మేళతాళలతో పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. స్థానికంగా పూజలు నిర్వహించి గ్రామస్తులకు ఆశీర్వచనాలు ఇచ్చారు. నియోజకవర్గంలో అనేక పురాతన ఆలయాలు ఉన్నాయని, అవన్నీ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని, ఈ ప్రాంతంలో ఆధ్మాత్మిక అభివృద్ధి జరిగి ప్రజలకు ఆనందభరిత జీవితాన్ని ప్రసాదించాలని కోరారు. అనంతరం పలు రకాల ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు, అరుణకుమారి దంపతులు రాజాస్వామినాథ గురుకుల్, మహాలింగ గురుకుల్‌లను సత్కరించారు. కార్యక్రమంలో యడ్లపాడు శివాలయం అభివృద్ధి కమిటీ శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, రామసుబ్బారావు, గ్రామపెద్దలు ముత్తవరపు రామారావు, రవీంద్ర, మాధవరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment