ఎన్‌సీసీతో ఎంతో మేలు
నరసరావుపేట రూరల్: క్రమ శిక్షణ అలవర్చుకునేందుకు ఎన్‌సీసీ దోహదపడుతోందని గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ ఎస్‌ఎమ్ చంద్రశేఖర్ తెలిపారు. ఎన్‌సీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా చంద్రశేఖర్, 23వ ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సునీల్ గౌతమ్, కళాశాల చైర్మన్ మిట్టపల్లి వెంకటకోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడారు. ఎన్‌సీసీ ప్రాధాన్యాన్ని వివరించారు. మార్చి–24లో నిర్వహించిన సీ–సర్టిఫికెట్ ఫలితాలలో ఉత్తీర్ణులైన క్యాడెట్లకు అతిథులు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. సీ సర్టిఫికెట్ పూర్తిచేసుకున్న క్యాడెట్స్‌కు రూ.15వేలు విలువచేసే చెక్క రైఫిల్స్‌ను యాజమాన్యం అందించింది. అనంతరం ఎన్‌సీసీ డే సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన క్యాడెట్స్‌కు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డ్రిల్స్‌తో పాటు ఫోక్‌సాంగ్స్, సీనియర్ కాడెట్ కావేరి బృందం చేసిన కోలాటం ఆకట్టుకుంది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, ఎన్‌సీసీ అధికారి మేడికొండ రాజేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment