అంగన్‌వాడీలపై దాడులను నివారించాలి
నరసరావుపేట: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వచ్చాక అంగన్‌వాడీలపై జరుగుతున్న దాడులను నివారించి వారికి రక్షణ కల్పించాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీ యూ) జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావును కలిసి విన్నవించారు. ఇప్పటి వరకు బెదిరించి 15 మంది అంగన్‌వాడీలచే బలవంతంగా రాజీనామాలు చేయించారన్నారు. రాజీనామాలు చేయనివారిపై భౌతిక దాడులకు పాల్పడ్డారన్నారు. బెల్లంకొండ మండలం మన్నెసుల్తాన్ పాలెంకు చెందిన మాటూరి బుజ్జి, దుర్గి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన మాగులూరి పిచ్చమ్మపై అధికార పార్టీ నాయకులు దాడులు చేసి బెదిరించారని, అయితే వారు రాజీనామా చేయకపోతే భర్త, పిల్లలపై భౌతిక దాడులకు పాల్పడ్డారన్నారు. ఇప్పటికై నా జరిగిన ఘటనలపై విచారణ చేసి దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి శిక్షించాలని, భవిష్యత్‌లో దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరా వును కోరారు. జిల్లా అధ్యక్షురాలు కేపీజే మెటిల్డాదేవి, జిల్లా కార్యదర్శి ఎల్.మార్తేశ్వరి, ఎస్.ఆంజనేయనాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment