ఓబీసీ జన గణన చేయాలి
నరసరావుపేట: జనగణనతో పాటుగా సమగ్ర ఓబీసీ జన గణన చేపట్టి తద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ కులాలకు న్యాయంచేయాలని బీసీ సంక్షేమ సంఘ నాయకులు కోరారు. సోమవారం ఓబీసీ జన గణన చేపట్టాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేకు వినతిపత్రం అందజేశారు. సంఘ జిల్లా అధ్యక్షులు యామా మురళి మాట్లాడుతూ బీసీలకు సామాజికంగా, ఆర్థిక రాజకీయ రంగాలలో పెద్ద పీట వేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బాదుగునల శ్రీను, పలు నియోజకవర్గాల అధ్యక్షులు యడవల్లి కొండల గౌడ్, కాకుమాను రమేష్, షేక్ సిద్దయ్య, భీమవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మాకు పీఎఫ్ సౌకర్యం
కల్పించండి
గుంటూరు వెస్ట్ సుమారు 30 సంవత్సరాలు నిస్వార్థ సేవ చేసినందుకు తమకు న్యాయం చేయాలని వీఆర్వో (గ్రామ పునర్ నిర్మాణ సంస్థ) ఉద్యోగులు డిమాండ్చేశారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. వీఆర్వో సంస్థ గ్రామాభివృద్ధితోపాటు విద్యా వికాసానికి కృషి చేశామని చెప్పారు. జిల్లాలో సుమారు 1500 మంది ఉన్నారని వారందరికీ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలని సంస్థ సభ్యుడు టి.మహతి తదితరులు విజ్జప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment