ప్రతి ఫిర్యాదూ పరిష్కారం కావాలి
జాయింట్ కలెక్టర్ సూరజ్
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్)కు వచ్చే ప్రతి ఫిర్యాదూ పరిష్కారం కావాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆయన అర్జీలు స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన 34 మంది తమ వినతులను అందించారు. జేసీ మాట్లాడుతూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి సమస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి మురళి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డైవర్షన్ చానల్ పునరుద్ధరించండి
వారం రోజుల క్రితం పొలాలకు నీరు వచ్చే కాలువకు ఉన్న డైవర్షన్ చానల్‌ను గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పూడ్చివేశారు. దీంతో నీరు నిలబడి పంటలు పాడై పోతున్నాయి. వెంటనే ఆ చానల్‌ను పునరుద్ధరించండి.
– వి.తిరుపతయ్య, అంచులవారిపాలెం, రాజుపాలెం మండలం
Comments
Please login to add a commentAdd a comment