No Headline
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ప్రతి సోమవారం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక వల్ల ఫలితం ఉండడం లేదు. బాధితులకు న్యాయం జరగడం లేదు. పైగా అర్జీదారులను అధికారులు పదేపదే తిప్పుకుంటున్నారు. ఫలితంగా వ్యయప్రయాసలు భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఫిర్యాదులకు నిర్ణయించిన గడువులోగా పరిష్కారం చూపకపోవడంతో అవి రీఓపెన్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈఏడాది జూన్ 15 నుంచి ఇప్పటి వరకు పల్నాడు జిల్లాలో సుమారు 3,200 ఫిర్యాదులు అందగా అందులో 527 పరిశీలనలో ఉన్నాయి. 2,373 ఫిర్యాదులకు పరిష్కారం చూపగా, 299 రీఓపెన్ అయ్యాయి. ఇందులో అత్యధికంగా రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించినవే ఉన్నాయి. కలెక్టర్ అరుణ్‌బాబు ఫిర్యాదుల రీఓపెన్‌పై ప్రతి సోమవారం సమీక్షలు నిర్వహిస్తున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు.
ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూంతో..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ‘స్పందన’ ఫిర్యాదుల పరిష్కారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించేవారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఫిర్యాదుదారు, అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యే వరకు పనిచేసేవారు. దీనివల్ల ఫిర్యాదుదారులకు సత్వరమే సమస్య పరిష్కారం కాకపోవడానికి గల కారణాలు తెలిసేవి. కొత్త ప్రభుత్వం వచ్చాక కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూంకు స్వస్తిపలికారు. ప్రస్తుతం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సిబ్బంది, ప్రత్యేకాధికారులు ఈ పనిచేస్తున్నా గతంలోలాగా పారదర్శకత ఉండటం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
పరిష్కారం కాని సమస్యలు
కూటమి ప్రభుత్వం వచ్చాక అర్జీల రీఓపెన్ ఐదు నెలల్లోనే 299 అర్జీలు రీ ఓపెన్ పదేపదే తిరిగినా పరిష్కారం కాని వైనం ఇదీ జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పనితీరు గత ప్రభుత్వంలో సచివాలయ సిబ్బందితో ప్రత్యేక కాల్ సెంటర్ సమస్య పరిష్కారం అయ్యేవరకు పర్యవేక్షణ
రీ ఓపెన్ కాకుండా చర్యలు
జిల్లా, మండల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. ప్రజల ఫిర్యాదులు రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతున్నాం.
– అరుణ్‌బాబు, కలెక్టర్, పల్నాడు
Comments
Please login to add a commentAdd a comment