అధికారులు తప్పించుకుంటున్నారు
మాకు రూపెనగుంట్లలో ఐదు ఎకరాల పొలం ఉంది. రావిపాడు నుంచి పొలానికి వెళ్లాల్సి ఉంది. మధ్యలో దారిలేదు. ఆ దారి నీటితో నిండిపోయి ఉంటుంది. బ్రిడ్జి నిర్మించాలని గత నెలలో ఒకసారి కలెక్టర్కు ఫిర్యాదుచేశాం. ఆర్అండ్బీ అధికారులకు ఫిర్యాదుచేయండి అని చెప్పారు. తీరా అక్కడికి పోతే ఎన్ఎస్పీ అధికారులకు ఫిర్యాదు చేయమని చెబుతున్నారు. ఫిర్యాదు ఎవరికి చేయాలో తేల్చుకోవడానికే ఇంత సమయం పడితే, ఫిర్యాదు పరిష్కారం ఎంత సమయం పడుతుందో.
– పొగిలి శ్రీనివాసరావు, రామకష్ణ, తండ్రీకుమారులు, బరంపేట, నరసరావుపేట
●
Comments
Please login to add a commentAdd a comment