వైభవంగా లక్ష దీపోత్సవం
అమరావతి: అమరావతి అమరేశ్వరాలయంలో కార్తిక సోమవారం లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అలయంలో స్వామివారి ఎదురుగా వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలతో పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు భగన్నామ సంకీర్తనలు, మేళతాళాల నడుమ లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు. మహిళలు లక్ష దీపాలను వెలిగించారు. దీపకాంతులతో దేవాలయం కొత్త శోభను సంతరించుకొంది. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పల్నాటి ఉత్సవాలు జయప్రదం చేద్దాం
మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి
కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాలకు వచ్చే వీరాచారులకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యమూ కలుగకుండా అన్ని వసతులూ కల్పించడానికి అధికారులు, నాయకులు సమన్వయంతో పని చేయాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. నాగులేరు నీరు మరింత పరిశుభ్రంగా ఉండేందుకు సాగర్ కుడి కాల్వ నీటిని ఎస్కేప్ చానల్ ద్వారా విడుదల చేయాలని ఎన్‌ఎస్‌పీ అధికారులను ఆదేశించారు. సరిపడినన్ని మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు. పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని చెప్పారు. ఉత్సవాల ప్రారంభ తేదీ ఈనెల 30 నుంచి ముగిసే తేదీ 4 వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడా లని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణపైనా దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ వాసు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment