పల్నాడు
మంగళవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2024
ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు యర్రగొర్ల నరసింహారావు. పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామం. ఈ ఏడాది సెప్టెంబర్ 9న లగడపాడులోని దళిత యువకులపై అగ్రవర్ణానికి చెందిన యువకులు కులం పేరుతో దూషిస్తూ దాడిచేశారు. దీనిపై కేసు నమోదైంది. అదే నెల 12న బాధితులు 17 మందిపై దాడిచేసిన యువకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమ కేసు నమోదు చేశారు. తమపై దాడిచేసి తిరిగి అక్రమ కేసు బనాయించడమేంటని దళిత యువకుడు యర్రగొర్ల నరసింహారావు, బాధితులు రెండు నెలలుగా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల చుట్టూ మూడు, నాలుగు సార్లు తిరిగి అర్జీలు పెట్టుకున్నారు. అర్జీని కలెక్టర్ ఎస్పీకి బదిలీ చేశారు, ఎస్పీ సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదును బదిలీ చేశారు. కానీ ఇప్పటివరకు దళిత యువకులపై నమోదు చేసిన కేసును మాత్రం ఉపసంహరించలేదు. కనీసం ఫిర్యాదుకు ఎందుకు పరిష్కారం చూపడం లేదో కూడా తెలియడంలేదని నరసింహారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పనితీరుకు అద్దం పట్టే ఘటన ఇది.
బాధితులపైనే కేసు.. అయినా పట్టదా బాసూ
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment